Harish Rao| తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు(BR Naidu) వరుసగా తెలంగాణ నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను కలిసిన ఆయన.. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు తిరుమల సేవల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన బీఆర్ నాయుడికి తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని తెలిపారు. తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ సిఫారసు లేఖలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.