తూప్రాన్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గా మామిండ్ల జ్యోతి కృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టడంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.