Saturday, March 29, 2025
HomeతెలంగాణKTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు భారీ షాక్ తగిలింది. నల్గగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేటీఆర్‌‌పై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్ అయిందంటూ ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్‌ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు.

- Advertisement -

ఈమేరకు కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సోషల్‌ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌ కుమార్‌‌లపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏ1గా క్రిశాంక్, ఏ2గా కేటీఆర్, ఏ3గా దిలీప్‌ను చేర్చారు. కాగా పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఓ మైనర్‌ బాలికతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News