తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ (TGSRTC) కొత్త బస్సు డిపోలు మంజూరయ్యాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆర్టీసీ వ్యవస్థలో రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా పని చేయడం తనకి సంతృప్తికరంగా ఉందని పొన్నం వెల్లడించారు.
10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)ని లాభాల బాటలో తీసుకుపోతున్నామని మంత్రి తెలిపారు. నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు, కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లా లోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ రెండు ఆర్టీసీ డిపోలకు సంబంధించి డిసెంబర్ 3న ఆర్డర్లు వచ్చాయన్నారు.