Saturday, November 15, 2025
HomeTop StoriesBathukamma: బతుకమ్మ వేళ విషాదం.. గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి

Bathukamma: బతుకమ్మ వేళ విషాదం.. గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి

Two Women Died on Bathukamma: బతుకమ్మ పూల పండుగలో తీరని విషాదం చోటుచేసుకుంది. నవరాత్రులు బతుకమ్మను పూలతో అలంకరించి సంబరాలు చేసి దసరా పండుగను సంతోషంగా నిర్వహించుకుందామనుకున్న ఆ రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. వారి కుటుంబాల్లోనే కాదు ఆ గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

- Advertisement -

బతుకమ్మ ఆడుతూ గుండెపోటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంకు చెందిన శెట్టి మౌనిక (32) బతుకమ్మ ఆడేందుకు తన ఇద్దరు కూతుళ్లు, కుమారునితో కలిసి గ్రామంలోని గుడి వద్దకు చేరుకుంది. డీజే సౌండ్‌కు బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడుతున్న సమయంలోనే మౌనిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/revanth-reddy-govt-to-procure-paddy-from-farmers/

పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మౌనికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. కాగా, డీజే సౌండ్‌తోనే మౌనిక మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సోమవారమే మౌనిక పుట్టినరోజు కావడం, అదే రోజు అంత్యక్రియలు జరగడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మరో సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగలి మేఘన(24) సైతం బతుకమ్మ ఆడుతుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి కిందపడిపోయింది. వెంటనే అక్కడున్న మహిళలు జహీరాబాద్‌లోని ప్రభ్వుత ఆస్పత్రికి తరలించిన అనంతరం.. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/junior-engineering-student-suicide-senior-harassment-bar-bill/

ప్రస్తుత కాలంలో గుండెపోటుకు గురైన వారి వయసు ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఐదు పదులు దాటిన వారు హార్ట్‌ ఎటాక్‌కు గురి కావడం.. వారి ఆరోగ్య కారణాల రీత్యా సర్వసాధారణంగా భావిస్తాం. కానీ ఇటీవలి కాలంలో నలభై దాటని వారు కూడా ఛాతీ నొప్పికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత ఘటనలో ఒక మహిళ 35 లోపే ఉండటం, మరో మహిళ 25 లోపే ఉండటం జీర్ణించుకోలేని విషయం. జీవన శైలి, ఆహారంలో మార్పులు.. ఇవన్నీ గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. జీవితంలో ఎదగాల్సిన వయసులో అనారోగ్యం కారణంగా మృతి చెందడం ఆయా గ్రామాల ప్రజలను కలచివేస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad