దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జయంతిని పురస్కరించుకొని ఎస్.ఆర్. నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి డీజీపీ అంజనీ కుమార్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. తన బ్యాచ్మేట్ అయిన ఉమేష్ చంద్ర తండ్రిని కలసి, ఉమేష్ చంద్రతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తానూ, ఉమేష్ చంద్ర ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ ఎస్.పి.లు గా తమ కెరీర్ లను ప్రారంభించామని డీజీపీ అంజనీ కుమార్ ఈ సందర్బంగా తెలిపారు.