ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగులు, గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్, కార్యక్రమంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసు దేవరెడ్డి.
గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్
ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ…
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు విద్యార్థులు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు.
వంద రోజుల్లో చేస్తానన్నా హామీలు అమలు చేసి తీరాల్సిందే.
గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలి.
గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి.
పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7,8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? హామీని నిలబెట్టుకోవాలి.
25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25 వేల పోస్టులతో మా డీఎస్సీ నిర్వహించాలి.
ఇచ్చిన హామీలు అన్ని అమలయ్యేదాకా విద్యార్థుల తరఫున బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.
విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏడాదిలోపే కాంగ్రెస్ పార్టీ పై అన్ని వర్గాల వ్యతిరేకత వచ్చింది.
విద్యార్థుల సమస్యల పట్ల హరీష్ రావు గారు మాట్లాడితే, మా పార్టీ నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలు పరిష్కరించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ…
తప్పుడు హామీలు, అబద్ధపు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను రోడ్లమీదకు ఈడ్చింది.
ఏడాది కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది.
అన్ని వర్గాల ప్రజలు సో కార్డు ప్రజాపాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారు.
మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టేది లేదు.
విద్యార్థుల తరఫున గొంతేత్తి పోరాటం చేస్తాం. నిరుద్యోగుల పక్షాన నిలబెడితాం.
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం చేసేందుకు బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.