Saturday, November 15, 2025
HomeతెలంగాణBandi Sanjay: జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తాం.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం!

Bandi Sanjay: జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తాం.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం!

Union Minister Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీల ప్రచారం సాగుతోంది. నిన్నటితో నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో.. ప్రచారంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన పెద్దమ్మ గుడిని.. జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపిస్తే పునర్నిర్మిస్తామని అన్నారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

బస్తీల అభివృద్ధిని గాలికొదిలేశారు: జూబ్లీహిల్స్ అంటే కేవలం అద్దాల మేడలు కాదని బండి సంజయ్ అన్నారు. ఇక్కడ ఎన్నో బస్తీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ బస్తీల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై కోపంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై కోపంతో మళ్లీ బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మరోసారి మోసపోతామని అన్నారు. బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/minister-komatireddy-venkat-reddy-expressed-deep-condolences-to-komatireddy-manjula-rani-death/

ఎంఐఎంకు పోటీ చేసే దమ్ము లేదా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఎంఐఎం పార్టీని సైతం లక్ష్యంగా చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేసే దమ్ము ఎంఐఎంకు లేదా.. అని ప్రశ్నించారు. పతంగి పార్టీకి ఓ దారం రేవంత్ రెడ్డి కాగా..మరో దారం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. దేశమంతా పోటీ చేసే ఎంఐఎం జూబ్లీహిల్స్ ఎందుకు పోటీ చేయట్లేదో స్పష్టం చేయాలని సవాల్ విసిరారు.

భారీ సంఖ్యలో అభ్యర్థుల నామినేషన్లు: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి 6 రోజుల్లో 94 మంది నామినేషన్లు వేయగా.. చివరి రోజైన మంగళవారం 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేడు నామినేషన్ లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ ల ఉపసంహారణకు ఈ నెల 24 తుది గడువుగా ఎన్నికల నోటిఫికేషన్ లో తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : ఈ నెల 13
నామినేషన్ల దాఖలు చివరి రోజు : ఈ నెల 21
నామినేషన్ల పరిశీలన              : ఈ నెల 22
నామినేషన్ల ఉపసంహరణ        : ఈ నెల 24
పోలింగ్                              : వచ్చేనెల 11
కౌంటింగ్                             : వచ్చేనెల 14

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad