Saturday, November 15, 2025
HomeతెలంగాణKishan Reddy: 'సన్న బియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదే.. ఆ పథకాన్ని రేవంత్‌ రెడ్డి...

Kishan Reddy: ‘సన్న బియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదే.. ఆ పథకాన్ని రేవంత్‌ రెడ్డి ఎలా ఆపుతారు?’

Union Minister Kishan Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అన్నారు. అందుకే సర్వేల్లో స్పష్టత లేకుండా పోయిందని తెలిపారు.

- Advertisement -

వెనుకబాటుకు ఆ రెండు పార్టీలే కారణం: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నువ్వా నేనా అన్నట్టుగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పోటాపోటిగా మాటల దాడికి దిగుతుంటే.. బీజేపీ మాత్రం తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. గ్రామ పంచాయతీల్లో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్‌లోని పలు బస్తీల్లో కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. వీధి లైట్లకు సైతం జీహెచ్‌ఎంసీలో డబ్బులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్ వెనుకబాటుకు కాంగ్రెస్‌తో పాటుగా బీఆర్‌ఎస్‌ సైతం బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/minister-duddilla-sridharbabu-participated-in-the-jubilee-hills-by-election-campaign/

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీ గురించి రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గ్యారంటీ హామీల గురించి కాంగ్రెస్‌ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదేనని అన్నారు. ఈ పథకాన్ని ఆపుతామని సీఎం రేవంత్‌ ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేవలం ఫ్రీ బస్‌ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. అన్ని సమస్యలకు ఫ్రీ బస్‌ ఒక్కటే పరిష్కారం అన్నట్టుగా కాంగ్రెస్‌ వ్యవహరించడం దారుణమని తెలిపారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన మోసంతో.. ఎటు ఓటు వేయాలో ఇంకా జూబ్లీహిల్స్‌ ఓటర్లు నిర్ణయానికి రాలేదని అన్నారు. అందుకే సర్వేల్లో స్పష్టత లేకుండా పోయిందని మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ ప్రజల బీజేపీని గెలిపిస్తారని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad