రేపటి (ఆదివారం) నుంచి వచ్చే నెల 1వ తేది వరకు హైదరాబాద్ లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ.వెంకటచారి అధికారులను ఆదేశించారు. శనివారం డీఆర్ఓ తన చాంబర్ లో యూపీఎస్సీ (UPSC) డైరెక్టర్ మనోజ్ దేహురీ తో కలసి లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు, వెన్యూ సూపర్ వైజర్ అధికారులు, రూట్ ఆఫీసర్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో ఏర్పాట్ల పై నిర్వహించిన కో ఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివారం నుంచి 1 వ తేదీ వరకు జరిగే యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. పరీక్షా కేంద్రం ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, నాంపల్లి (ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ పక్కన) గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని టిజీఎస్ పిడిసిఎల్ ను, తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్ ఆర్టీసి ని, ఏఎన్ఎమ్, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ ను, శానిటేషన్ ఏర్పాటు చేయాలని డీఎమ్ హెచ్ఓ ను ఆయన ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద జామర్ ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, తిరిగి మధ్యాహ్నాం రెండున్నర గంటల నుంచి అయిదున్నర గంటల వరకు రెండు షిఫ్ట్ లలో జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్ష కు 222 అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతించబోమని తెలిపారు. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అయన తెలిపారు.
ఒరిజినల్ హాల్ టికెట్, గుర్తింపు కార్డు తీసికోని రావాలని అన్నారు.పరీక్షా కేంద్రం ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, నాంపల్లి (ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ )ప్రక్కన లో ఉందన్నారు. యూపీఎస్సీ (UPSC) నిబంధన మేరకు పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూమ్ ఉండదని, కావున అభ్యర్థులు ఎవరు కూడా బ్యాగులు, సెల్ ఫోన్లు, ఏలాంటి వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో య్రూపీఎస్సీ డైరెక్టర్ మనోజ్దేహురీ, జీహెచ్ఎంసీ, వైద్యశాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.