సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మెడ్చల్‌లో జి5 మీడియా గ్రూప్, కేపీ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా “ఫస్ట్ అటెంప్ట్‌లో సివిల్ సర్వీసెస్ ఎలా క్రాక్ చేయాలి-యూపీఎస్సీ మాస్టర్ క్లాస్” అనే సీమినార్ విజయవంతంగా సాగింది.
21st సెంచురీ ఐఏఎస్ ఆధ్వర్యంలో..
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ సివిల్ సర్వెంట్స్ కి ఉన్న అధికారంతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించొచ్చు అని విద్యార్థులకు ప్రత్యక్ష ఉదారహణలతో వివరించి, వారిలో ఉత్తేజాన్ని నింపారు. ఇందులో భాగంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రిని వ్యతిరేకించి, తన నైతికతను నిరూపించిన ఐఏఎస్ అధికారిని రజనీ సేఖరి సిబాల్ గురించి, చివరికి 2013లో ఆ సీఎంని జైలుకు వెళ్ళేట్టు చూపిన తెగువను ఇంజినీరింగ్ విద్యార్థులకు కృష్ణ ప్రదీప్ వివరించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను గుర్తించి, వారిని భవిష్యత్తు నాయకులుగా తయారు చేయడం తమ అకాడమీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రెండున్నర దశాబ్దాలు విశాల అనుభవం..
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ డా. భవానీ శంకర్ మాట్లాడుతూ, రెండున్నర దశాబ్దాలుగా తమ అకాడమీ అందిస్తున్న కోచింగ్ విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి సంవత్సరం యూపీఎస్సీలో కనీసం 20 ర్యాంకులు సాధిస్తూ, రాబోయే ఐదు సంవత్సరాల్లో 100 ర్యాంకులు సాధించాలనే లక్ష్యంగా తమ సంస్థ 21st సెంచురీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఆస్పిరెంట్స్ క్లబ్
సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ డా. రాజి రెడ్డి మాట్లాడుతూ, ఈ సెమినార్‌లో నిపుణుల సలహాలను గమనించి నోట్స్ తయారు చేసుకోమన్నారు. త్వరలోనే క్యాంపస్‌లో సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్ ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
డా. శ్రీనివాస్, డీన్ (ఎఫ్‌ఎస్‌ఏ), 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఫైనాన్స్ డైరెక్టర్ వరుణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.ప్రశాంత్, జి5 మీడియా గ్రూప్ డైరెక్టర్ గిరి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డీన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సివిల్ సర్వీసు అభ్యర్థుల కోసం తమ కాలేజ్ లో ప్రత్యేక క్లబ్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. మున్ముందు తమ కాలేజీ నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.