Sunday, November 16, 2025
HomeతెలంగాణPrabhakar Rao: SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావుకు అమెరికా ప్రభుత్వం షాక్

Prabhakar Rao: SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావుకు అమెరికా ప్రభుత్వం షాక్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) A1 నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావుకు(Prabhakar Rao) మరో భారీ షాక్ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్ రావు‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని తేల్చి చెప్పింది.

- Advertisement -

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరు కాని పక్షంలో నేరస్థుడిగా పరిగణించనున్నారు. కాగా ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించడంలో ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ముమ్మరం చేసింది. అతి త్వరలోనే ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad