Wednesday, January 8, 2025
HomeతెలంగాణV.C. Sajjanar: ఆశ ఉండొచ్చు తప్పులేదు.. అత్యాశ ఉండకూడదు: సజ్జనార్

V.C. Sajjanar: ఆశ ఉండొచ్చు తప్పులేదు.. అత్యాశ ఉండకూడదు: సజ్జనార్

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు(Cyber ​​Frauds)పెరిగిపోతున్నాయి. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్(Online Betting) యువతను అప్పుల ఊబిలోకి లాగుతున్నాయి. వీటి మాయలో పడి ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా టీజీఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) మరోసారి ఈ బెట్టింగ్ యాప్‌ల మోసాలపై ఎక్స్ వేదికగా హెచ్చరికలు చేశారు

- Advertisement -

“వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడా!? అంటే 99 రెట్లు లాభమా?! ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా అసలు. ఇలా నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోకండి. సోషల్ మీడియాలో మీ కంట పడే ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఏరి కోరి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడకండి. జీవితాలను చిద్రం చేసుకోకండి.

ఆశ ఉండొచ్చు తప్పులేదు.. అత్యాశ, దురాశ ఉంటే మీకు చివరికి బాధ, దుఃఖమే మిగులుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ గాళ్లు గురించి మీకు సమాచారం ఉంటే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయండి.” అని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News