Tuesday, September 17, 2024
HomeతెలంగాణVaddiraju: సివిల్స్ ర్యాంకర్ కు కంగ్రాట్స్ చెప్పిన ఎంపీ

Vaddiraju: సివిల్స్ ర్యాంకర్ కు కంగ్రాట్స్ చెప్పిన ఎంపీ

సివిల్స్ లో 3వ ర్యాంకు సాధించిన ఉమ మున్నూరుకాపు ముద్దుబిడ్డ కావడం సంతోషదాయకం అంటూ శుభాకాంక్షలు చెప్పారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఉమను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులు,యువతకు హితవు పలికారు ఎంపీ రవిచంద్ర. ఉమాభారతికి రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మున్నూరుకాపు ముద్దుబిడ్డ కావడం తమకు మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆమె ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి, తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పుట్టినగడ్డకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షించారు. ఉమను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నతంగా ఎదగాల్సిందిగా విద్యార్థులు, యువతకు ఎంపీ రవిచంద్ర హితవు పలికారు. ఉమ ఇంత గొప్ప విజయాన్ని అందుకునేందుకు స్ఫూర్తినిచ్చిన, ప్రోత్సహాన్నందించిన ఆమె తండ్రి, నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, తల్లి శ్రీదేవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ వద్దిరాజు శుభాభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News