Saturday, April 12, 2025
HomeతెలంగాణVajpayee Birth anniversary: వాజ్ పేయి జయంతికి కూన శ్రీశైలం గౌడ్ ఘన నివాళి

Vajpayee Birth anniversary: వాజ్ పేయి జయంతికి కూన శ్రీశైలం గౌడ్ ఘన నివాళి

వాజ్ పేయ్ జయంతి వేడుకల్లో...

బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ గారి జయంతి సందర్బంగా గాజులరామారం లోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను కొనియాడారు. రెండు సీట్లు ఉన్న పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన ఘనత వాజ్ పేయ్ గారిదని అన్నారు. అటల్ జీ అందించిన స్పూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి సీటును గెలిచి, మోడీ గారు మళ్ళీ ప్రధాని అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు రాజిరెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేకే శేఖర్ యాదవ్, సదానందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చండి శ్రీనివాస్, సెన్సార్ బోర్డు సభ్యులు సరితా రావ్, పార్లమెంట్ కోకన్వీనర్ డా. రాజు, జిల్లా నాయకులు బావిగడ్డ రవి, పత్తి రఘుపతి, గరిగే శేఖర్, అర్కల సుధా, సతీష్ సాగర్, శివాజీ రాజు, మోతె శ్రీనివాస్ యాదవ్, నల్ల జయశంకర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఆకుల సతీష్, జనార్దన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి, పరుష వేణు, కంది శ్రీరాములు, పులి బలరాం, నాయకులు కుమ్మరి శంకర్, సుశాంత్ గౌడ్, ప్రసాద్, కృష్ణ యాదవ్, అలివేలు, కృష్ణవేణి, మాధురి, వేణు, రమణ రెడ్డి, సాయి ప్రతాప్, గండి రాజు యాదవ్, మధు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News