వనపర్తి వైద్య చరిత్రలో రికార్డ్ నమోదైంది. ఒకే రోజు 28 కాన్పులు జరిగాయి ఇక్కడి ఆసుపత్రిలో. 13 సాధారణం, 15 సిజేరియన్ డెలివరీలు అయ్యాయి. పుట్టిన బిడ్డలలో ఒక జంటకు కవలపిల్లలున్నారు. మాతా శిశుసంరక్షణ కేంద్రం ఏర్పాటుతో మారిన పరిస్థితుల కారణంగా సర్కారీ దవాఖానాకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది.
గర్భిణులు, శిశువులకు అందుబాటులో వైద్యసేవలుండడం ఇక్కడి మరో స్పెషాలిటీ. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ప్రభుత్వ తొలి ప్రాధాన్యతలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రజలకు అందుబాటులోకి వైద్యసేవలు వచ్చాయంటూ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లాకో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలతో ప్రజలకు మరింత అందుబాటులో వైద్యం రానుందంటూ మంత్రి భరోసా ఇచ్చారు. వైద్యులు నరేంద్రకుమార్, రాజ్ కుమార్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బందిని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందినంచారు.