వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మేఘారెడ్డి గోపాల్పేట మండలం రేవల్లి మండలం ఏధుల మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గోపాల్పేట మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో డప్పు వైద్యాల మధ్య నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి మహిళలే ఆనందోత్సవాలతో నృత్యాలు చేయడం గమనార్హం. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పదేళ్ల పాలనలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం మంత్రులు ఎమ్మెల్యే మాత్రమే వారి సొంత అభివృద్ధి చేసుకున్నారని ప్రజలను విస్మరించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అందుకు సంబంధించి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఫైళ్లపై మొదటి సంతకం చేస్తారని దాదాపు 20 సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కెనాల్ లు తవ్వారని కేవలం శిల్ల మలిపి పంచ కట్టుకున్నంత మాత్రాన ఎవరు కూడా రాజశేఖర్ రెడ్డిలా ఉండలేరని ఆయన అన్నారు.
తనను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంటి ముందు పెద్ద జీతగాడిలా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నుంచి దాదాపు 200కు పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారిలో మాజీ మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కార్యకర్తలు యూత్ సభ్యులు, ఉన్నారు.
కార్యక్రమంలో గోపాల్పేట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శివన్న, ఉపాధ్యక్షుడు నాగ శేషు యాదవ్ యూత్ అధ్యక్షుడు ఎండి బాల పీరు, RTI చైర్మన్ మాజీ ఎంపీటీసీ మేస్త్రి బాలయ్య, పోల్ల్కే పహాడ్ మాజీ సర్పంచ్ సత్య శీలా రెడ్డి, నెంబర్ వెంకటయ్య వార్డ్ మెంబర్ వెంకటయ్య బైక్ మెకానిక్ శంకర్, కిషోర్, ఉప్పరి యాదగిరి, నరేందర్, జగన్ గోపాల్పేట మండలం కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు పెద్దలు పార్టీ శ్రేణులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.