వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మెగా రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తూడి మేఘరెడ్డి మంగళవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నాచహాల్లి, కంచిరావుపల్లి, కంబల్లాపురం, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు.అనంతరం పెబ్బేరు మీదుగా బీచుపల్లి వెళ్లే సమయంలో పెబ్బేరు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నాయకులు పెబ్బేరు పట్టణ చౌరస్తాలోనీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన వారు పార్కులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన బీచ్ పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రంగాపురం గ్రామానికి వెళ్లారు గ్రామానికి వచ్చిన ఆయనకు రంగాపురం గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందుకు సహకరించిన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు చిన్నారెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటి వరకు తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఇకపై కూడా అట్లాగే ఉంటానని, ఎక్కడైనా నేను లైన్ తప్పి అవినీతి పనులకు పాల్పడినట్లు గుర్తిస్తే అక్కడే రాళ్లతో కొట్టాలని ఆయన గ్రామస్తులకు భరోసా కల్పించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.