తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏండ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూతురు డాక్టర్ ప్రత్యూష అన్నారు. ఖిల్లా ఘనపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామంలో రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించి గురువారం ఉదయం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంను నిర్వహించారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నిలపారన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని భారీ మెజార్టీటి అందించి ఆశీర్వదించాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు విక్రం నారాయణదాసు కిట్టు, నాయకులు, మహిళా నాయకులు కవిత తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మొదటగా వాడుకున్నది ఖిల్లా ఘనపురం మండలం
సల్కలాపూర్ గ్రామంలో మంత్రి కూతురు డాక్టర్ ప్రత్యూష ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ల నిరంజన్ రెడ్డి గణపురం మండల కేంద్రానికి నీళ్లు తీసుకురావడం వల్లనే దాదాపు 35 సంవత్సరాల తర్వాత గణప సముద్రం నిండి అలుగు పారిందని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మొట్టమొదటగా ఖిల్లా ఘనపురం మండలం ప్రజలు వాడుకోవడం చాలా ఆనందంగా ఉందని తాత వివరించారు.