ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగిన అన్యాయం చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతూనే ప్రజల కష్టాలు తీరుతాయని నమ్మి ఉద్యమ నాయకుడి వెంట అడుగులు వేసి ఉమ్మడి జిల్లాలో తొలి జెండాను ఎత్తుకున్న నాయకుడు ప్రస్తుత మంత్రి, బిఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి నియోజకవర్గంలో, రాష్టంలో పేదల ప్రభుత్వంకు మరోసారి అవకాశం కల్పించాలని మంత్రి కూతురు డాక్టర్ ప్రత్యుష ప్రజలను కోరారు.
ఖిల్లా ఘనపురం మండలం వెంకటాంపల్లి గ్రామంలో ఆమె స్థానిక నాయకులతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్తూనియోజకవర్గంలో వెంకటంపల్లిలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ 27 లక్షల 50 వెలతో ఖిల్లా గణపురం నుంచి వెంకటంపల్లి వరకు బీటీ రెన్యూవల్ రోడ్డు, వెంకటం పల్లి నుండి కమలోద్దినపూర్ వరకు రూ 39 లక్షలతో బీటీ రెన్యూవల్ రోడ్డు, ఎస్సీ యాదవ సాగర కమ్యూనిటీ హాల్ తో పాటు భవన యూత్ నిర్మాణాన్ని నిర్మించామని ఆమె గుర్తు చేశారు. నిరంజన్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఆమె వెంట వెంకటం పల్లి గ్రామ సర్పంచ్ అరుణ సురేందర్ గ్రామ అధ్యక్షుడు అంజిరెడ్డి ఎంపిటిసి లావణ్య పురుషోత్తం ఎంపీపీ కృష్ణ నాయక్ జడ్పిటిసి సామ్యా నాయక రాష్ట్ర ఆయిల్ ఫారం డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య సింగిల్ విండో చైర్మన్ మురళీధర్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి పురేందర్ రెడ్డి యువజన నాయకులు నారాయణ దాస్ కిట్టు తదితరులు పాల్గొన్నారు.