Thursday, July 4, 2024
HomeతెలంగాణVardhannapeta: ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం

Vardhannapeta: ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం

వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు

వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో కె.ఆర్ నాగరాజు ప్రమాణస్వీకారం చేసి మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి శేష వస్త్రాలను, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం సోనియా గాంధీ ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని, తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏ కష్టంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – రాజేశ్వరరావు, మాజీ ఎం.పి సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్రావు, వెంకట నరసయ్య రెడ్డి, ఐనవోలు మండల అధ్యక్షుడు సమోట మహేష్ గౌడ్ తో పాటు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News