రోడ్డు ప్రమాదాలతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్స్ గురించి సోషల్ మీడియాలో నిరంతరం అవగాహన కల్పించే పోస్టులు పెట్టే టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై కారు ఆపి.. డోర్ తీయడం వల్ల వెనుక నుంచి వచ్చిన ఓ బైకర్ దానికి తగిలి కిందపడిపోతాడు.
‘ఇదేం నిర్లక్యం.. కనీస మానవత్వం కూడా లేదా..? నడిరోడ్డుపై వాహనాన్ని ఆపి.. కారు డోరు తెరవడమే తప్పు. తమ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందనే సోయి లేకుండా.. తమకేం పట్టనట్టు ఎలా ప్రవర్తించారో చూడండి. న్యూ ఇయర్ నాడు దేశ రాజదాని న్యూఢిల్లీలో జరిగిందీ ప్రమాదం.
కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గుర్తించి.. కారు డోర్ తీయండి. తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదాలకు కారణం కాకండి” అని సూచించారు.