‘మ్యాట్రీమోనీ’ మోసాలతో తస్మాత్ జాగ్రత్త అంటూ టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC.Sajjanar) తెలిపారు. ఈ మోసాలపై యువతను అలర్ట్ చేస్తూ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
“మ్యాట్రి ‘మనీ’ మోసాలతో తస్మాత్ జాగ్రత్త. మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా ఈమధ్య పెరిగిపోతున్న మోసాలు. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సిందే. మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి” అని సూచించారు.