Friday, September 20, 2024
Homeతెలంగాణమహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి వేముల

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి వేముల

మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్ లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు, అంగన్ వాడి సూపర్ వైజర్లు,VOA లు, Ccలు, ANMs, ఆశా వర్కర్లతో మంత్రి సతీమణి నీరజా రెడ్డితో కలిసి మహిళ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. వారి సేవలు, పని తీరును ప్రశంసించారు. ఈ సందర్బంగా మంత్రి సొంత తన ఖర్చులతో సుమారు 1000 మందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం సతీసమేతంగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
మహిళా సాధికారత కోసం సీఎం కేసిఆర్ అంతలా ప్రపంచంలోనే మరెవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసిఆర్ కిట్ తో మొదలు వృద్యాప్యంలో ఆసరా పెన్షన్ వరకు ఎన్నో మానవీయ కోణ కార్యక్రమాలు నేడు కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజా రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News