Sunday, October 6, 2024
HomeతెలంగాణVempally: నెలరోజులైనా.. ధాన్యం ఎక్కడిదక్కడే

Vempally: నెలరోజులైనా.. ధాన్యం ఎక్కడిదక్కడే

రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోస్తే కొనుగోలు కేంద్ర నిర్వహకులు రైతులతో ఆడుకుంటున్నారు. ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో నెలరోజుల కింద పోసినా గాని ఇప్పటికీ తూకం వేయకుండా వారిని పట్టించుకోవడం లేదు. సెంటర్ నిర్వాహకులను ఏదైనా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సెంటర్లో మిమ్మల్ని ఎవరు పోయమన్నారని, మీ ధాన్యాన్ని తగలబెట్టుకొండి అని రైతులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తూకం వేయించుకోలేక రైతులు సతమతమవుతున్నారు. మండల కేంద్రంలో ఎక్కడ లేని హమాలి చార్జీలు వేంపల్లి ఐకెపి సెంటర్లో వసూలు చేస్తూ రైతుల్ని నట్టేట ముంచుతున్నారు.. ఎక్కడ లేని హమాలి చార్జీలు ఇక్కడ వసూలు చేస్తున్నారని రైతులు ఐకెపి సెంటర్ నిర్వాహకులను అడగగా హమాలీలు దొరకక అధిక చార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పడం తో రైతులు అవాక్కయ్యారు. ఎవరికి చెప్పకుండా ఇలా 45 రూపాయలు వసూలు చేయడం దారుణమని, తూకం వేసి వారం రోజులు గడుస్తున్న బస్తాలు లారీలలో పంపక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వసులలో అధికారుల హస్తం ఉందేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మండలం లో ఎక్కడ లేని విధంగా అధిక వసూలు చేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాన్ని చదును చేయకపోవడం, రైతులు సొంతంగా కళ్లను చదును చేసుకోవడం, రైతులకు కొనుగోలు కేంద్రం లో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఐకెపి నిర్వా హకులు ఉన్నారని, ఐకెపి సెంటర్లో నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

- Advertisement -

నెలరోజుల కిందట పోసిన ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే మీ ధాన్యాన్ని తగుల పెట్టుకొండని నిర్వహకులు అంటున్నారని, మిమ్మల్ని ఎవరు ధాన్యం కేంద్రంలో పోయమన్నారని బెదిరిస్తున్నారు. మా ధాన్యం తూకం వేసేది ఎప్పుడని రైతులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News