Saturday, September 21, 2024
HomeతెలంగాణVemsuru: ఘనంగా జలగం జయంతి

Vemsuru: ఘనంగా జలగం జయంతి

వేంసూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. మాజీ మంత్రి వర్యులు, AICC మెంబర్, PCC సీనియర్ ఉపాధ్యక్షులు, సంభానీ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి వర్యులు జలగం వెంగళరావు జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జలగం స్మృతులు గుర్తుచేసు కున్నారు. కార్యక్రమాన్ని వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహంచారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్ర శేఖర్ రెడ్డి, MPTC రాఘవ రెడ్డి గారు, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ ఇజ్జిగాని మధు,రావుల పుల్లారావు, మండల నాయకులు లక్ష్మారెడ్డి, మండల sc సెల్ అధ్యక్షులు సురేష్, విశ్వనాధం, సాయిబాబు, నాగేశ్వరావు, వెంకటేశ్వరరావు, జగన్, NSUI వెంకట కృష్ణ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో జలగం జయంతి
జలగం వెంగళరావు 101 వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News