Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

Vemula: విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

పెట్టుబడులకు స్వర్గదామం హైదరాబాద్

హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారత మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

విజనరీ లీడర్ కేసిఆర్ గారి వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ మహా నగరం అవతరించిందని మంత్రి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యిందని, కెటిఆర్ గారు SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రూరల్ ఎకానమీని సీఎం కేసిఆర్ గణనీయంగా పెంచారని దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోందని,టిఎస్ బి పాస్ ద్వారా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు లభిస్తున్నాయని అన్నారు.

“వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్” ఏది అని గూగుల్ సెర్చ్ చేయాలని మంత్రి కోరగా ఢిల్లీకి చెందిన బిజినెస్ మెన్ సెర్చ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బదులిచ్చారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారు చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.”

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News