Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: ప్రతి నెలా 300 మందికి బీసీ బంధు

Vemula: ప్రతి నెలా 300 మందికి బీసీ బంధు

బిసి కుల వృత్తులకు చేసే ఆర్థిక సహాయం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రతి నెల నియోజకవర్గానికి 300 చొప్పున అందిస్తామంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బిసి కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాల ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

- Advertisement -

మంత్రి వేముల కామెంట్స్:

“దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మంచి పనులు పెధలకోసం సీఎం కేసీఆర్ చేస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఎవరూ ఆకలితో అలమటించే కూడదని పనిచేసే గొప్ప వ్యక్తి కేసీఆర్. బిజెపి ,కాంగ్రెస్ వాళ్లకు ఎన్ని మంచి పనులు చేసిన కనబడదు. కోడి గుడ్డు మీద ఈకలు పికినట్లు వ్యవహరిస్తారు..వారికి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనబడుతది. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీడీ పెన్షన్ లు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చిన పెన్షన్ మాత్రం టంచన్ గా ఇస్తున్నాం. పేద ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి ఇస్తున్నాం..ఈ పథకం కూడా గతం లో లేకుండే. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల ను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తయారు చేసాము.. కేసీఆర్ కిట్టు పథకం ఒక మానవీయ కోణం ద్వారా వచ్చిన గొప్ప పథకం. సంపద సృష్టించి పేదలకు పంచాలి అనేది సీఎం కేసీఆర్ సంకల్పం. సాగు నీరు, ఉచిత కరెంట్ ,తాగునీటి కోసం లక్షల కోట్లు ఖర్చుచేసి ప్రజలకు అందిస్తున్నాం. విద్య వైద్యం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ మూడు అంశాలపైనే మా దృష్ట్రి. ఆ దిశగా ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. బిసిలకు చేసే ఆర్థిక సహాయం నిరంతరంగా కొనసాగుతది. ప్రతి నెల నియోజక వర్గానికి 300 చొప్పున అందిస్తాం. ప్రజల ఆశీర్వాదం తో మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఏదీ ఏమైనా కేసీఆర్ రే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News