Friday, April 11, 2025
HomeతెలంగాణVemula: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆరాధ్యుడు సంత్ సేవాలాల్

Vemula: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆరాధ్యుడు సంత్ సేవాలాల్

గిరిజన ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన్ను స్మరించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలం నడిమితండా గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నడిమితండాలో గల జగదాంబ అమ్మవారు, సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని,గొప్ప ఆధ్యాత్మిక గురువని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News