Monday, July 8, 2024
HomeతెలంగాణVemula: మోడర్న్ టెక్నాలజీతో కాకతీయ కాలువ బ్రిడ్జిలు

Vemula: మోడర్న్ టెక్నాలజీతో కాకతీయ కాలువ బ్రిడ్జిలు

సెంట్రింగ్ లేకుండా భీమ్స్, స్లాబ్ వేసే అవకాశం

బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్ పెట్ – పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ జీరో పాయింట్ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్ గాం వద్ద కాకతీయ కెనాల్ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

- Advertisement -

అధునాతన టెక్నాలజీతో కాకతీయ కాలువ మీద ఈ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఈ ఒక్కో బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 90 లక్షల వరకు మంజూరు చేశామని కానీ నీరు పారుతున్న సమయంలో సెంట్రింగ్ వేసి బ్రిడ్జిలు నిర్మించుకోవడం సాధ్యం కాలేదని అన్నారు. ఎండాకాలం సమయంలో కూడా బాల్కొండ నియోజకవర్గ రైతులు మక్క,సజ్జ,పసుపు,నువ్వులు లాంటి పంటలు వేస్తారని వాటికి కాకతీయ కెనాల్ నీళ్లు అవసరమని వివరించారు. కెనాల్ లో నీళ్ళు ఆపకుంటే బ్రిడ్జ్ ల నిర్మాణ పనులు సాగట్లేదు, నీళ్లు ఆపితే నియోజకవర్గ రైతులకు ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి నిర్మాణాల వల్ల నాలుగు గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. దాని కోసం ఆలోచన చేస్తుండగా అధునాత టెక్నాలజీతో సెంట్రింగ్ లేకుండా భీమ్స్, స్లాబ్ వేసే అవకాశం ఉన్నదని ఇంజనీర్ అధికారులు దృష్టికి తెస్తే ఆ పద్దతిలోనే చేద్దాం రైతులకు, ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జిల నిర్మాణం పూర్తవుతుందని చర్చించామని వివరించారు.

అందుకు అదనంగా నిధులు కావాలని అధికారులు అడిగారని, నాలుగు గ్రామాల ప్రజలు,బాల్కొండ రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని సీఎం కేసిఆర్ గారికి పరిస్థితిని వివరించి అదనంగా మరో 50 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని,నీటి విడుదలకు ఇబ్బంది లేకుండా మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు ప్రజలు,రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని నూతన టెక్నాలజీతో బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం కేసిఆర్ గారు అదనంగా నిధులు ఇచ్చారని,నాలుగు గ్రామాల ప్రజలు,బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన సీఎం కేసిఆర్ కి మంత్రి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,రైతులు,ప్రజలు,బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News