Sunday, November 16, 2025
HomeతెలంగాణVemula: తెలంగాణలో కేసీఆర్ ది జనరంజక పాలన

Vemula: తెలంగాణలో కేసీఆర్ ది జనరంజక పాలన

మీకు ఎల్లవేళలా తోడుంటా

రాష్ట్రంలో సీఎం కేసిఆర్ జనరంజక పాలన, అమలవుతున్న సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కమ్మర్పల్లి మండలం నాగపూర్, నర్సాపూర్ గ్రామాల నుండి కాంగ్రెస్, బీజేపీ వివిధ సంఘాలకు చెందిన సుమారు 300 మంది సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక తనకు, కేసిఆర్ కు మరింత బలాన్ని ఇస్తుందని, ఇక నుండి మీరు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులనీ మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

- Advertisement -

పార్టీలో చేరిన వారు:
నాగపూర్ నుండి యాదవ, కురుమ, మాల సంఘం, బంజారా సంఘం. నర్సాపూర్ గ్రామం నుండి వివిధ యువజన సంఘాల సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad