Friday, September 20, 2024
HomeతెలంగాణVemula: కేసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష

Vemula: కేసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష

తెలంగాణ రాష్ట్రంలో, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కమ్మర్పల్లి మండలానికి చెందిన BJP,BSP, కాంగ్రెస్ నాయకులు మరియు రైతు నాయకులు స్వచ్చందంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రైతుల కొరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట నడవడానికి నిర్ణయించుకొని కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన BJP,BSP,కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతు నాయకులు హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో స్వచ్చందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు..ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….

కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అయ్యిందన్నారు. రైతులు,పేదలు రెండు కండ్లుగా సీఎం కేసిఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారని,నేడు…అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆయన దార్శనిక పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉన్నదన్నారు. యావత్ భారత దేశం తెలంగాణ అభివృద్ది మోడల్ వైపు ఆసక్తిగా చూస్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని కోరుకుంటున్నారని,కేసిఆర్ నాయకత్వమే దేశానికి,రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో…

పన్నాల గంగారెడ్డి,ముత్యాల లక్ష్మణ్ గౌడ్ BJP,సింగిరెడ్డి ముత్యం రెడ్డి,సింగిరెడ్డి గంగారెడ్డి,కూలిపాటి గంగారెడ్డి,గోవింద్ గంగాధర్ BSP నుండి,కొమ్ములు కిషన్ కాంగ్రెస్ నుండి,రైతు నాయకులు కొమ్ములు రాజేందర్,కొమ్ములు శ్రీధర్,కొమ్ములు మహిపాల్,సింగిరెడ్డి బాలకృష్ణ,సింగిరెడ్డి బాల్ రెడ్డి,వేముల మొహన్ రెడ్డి,వేముల శివారెడ్డి,రేంజర్ల రోహిత్ రెడ్డి,సింగిరెడ్డి జలపతి రెడ్డి,గోపిడి రాజేందర్,సంత రాజేందర్,కొమ్ముల రాజేందర్ తదితరులు పార్టీలో చేరినారు…

కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు పార్టీ ప్రెసిడెంట్ రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, అహ్మద్, లుక్కా గంగాధర్, బద్దం చిన్నారెడ్డి, బద్రి రాజేశ్వర్, హల్దే శ్రీనివాస్, సుమన్, సంత రాజేశ్వర్, పాషా కో అప్షన్, సుధాకర్, హరీష్ రెడ్డి, మహేందర్, బొడ దేవేందర్, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News