Friday, April 4, 2025
HomeతెలంగాణVemula: తన ఎస్కార్ట్ వాహనం ఇచ్చి బాధితులను హాస్పిటల్ కు పంపిన మంత్రి

Vemula: తన ఎస్కార్ట్ వాహనం ఇచ్చి బాధితులను హాస్పిటల్ కు పంపిన మంత్రి

రోడ్ యాక్సిడెంట్ బాధితులను వెంటనే ఆదుకున్న మంత్రి

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా మేడ్చల్ నుండి కొంపల్లి రూట్లో చిన్నారితో కలిసి బైక్ పై వస్తున్న జంట బైక్ స్కిడ అఐ కింద పడడం చూసి వెంటనే తన కాన్వాయ్ ఆపి, వారి వద్దకు వెళ్ళి యోగ క్షేమాలు అడిగారు. చిన్నారిని గట్టిగా పట్టు కోవడంతో బైక్ పై నుండి పట్టుతప్పి పడి మహిళకు స్వల్ప గాయాలయ్యాయని గమనించిన మంత్రి వెంటనే వారిని దగ్గరుండి తన ఎస్కార్ట్ వాహనం ఎక్కించి బాధితులను హాస్పిటల్ పంపించారు. వారికి మంత్రి మనోధైర్యం చెప్పారు. తమ కోసం మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి వేములకు బాధితులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News