రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోన్కల్ గ్రామ x రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం, సుంకేట్ లో టీఆర్ఎస్వీ నాయకులు సంతోష్ గృహ ప్రవేశం, బాల్కొండ ఎంపిపి లావణ్య లింగాగౌడ్ కూతురు వివాహం, మంత్రి వేల్పూరు కార్యాలయDEO పులి టోనీ చెల్లెలి వివాహంతో పాటు పలు శుభ కార్యాలకు సతీసమేతంగా హాజరయ్యి నూతన వధూ వరులను ఆశీర్వదించారు.
భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సైన యోధుడు ఛత్రపతి శివాజీ అని పడగల్ లో ఆయన విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. అఖండ భారతమే ధ్యేయంగా 10 మంది సైనికులతో బయలుదేరిన ఛత్రపతి శివాజీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆయన ఆశయ స్పూర్తిని సీఎం కేసిఆర్ కొనసాగిస్తున్నారని అన్నారు.