ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి భారీగా రైతులంతా తరలివచ్చారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
రైతుల కల నెర వెరిన రోజు ఇదని, ఎప్పటికైనా..తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని, కలలో కూడా ఊహించలేదు గోదారమ్మ ఎదురు ఎక్కుతదని అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ కి రైతుల పక్షాన ధన్యవాదాలు చెప్పిన మంత్రి వేముల, నా హయాంలో ఎస్సారెస్పీ పునర్జీవం పనులు పూర్తి అవటం నా అదృష్టం గా భావిస్తున్నా అన్నారు. 2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మనియ స్థానం సంపాదించారు సీఎం కేసీఆర్ అంటూ, 300 కిలో మీటర్ లు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక వర్షాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడువునా రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ప్రతి పక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, 90 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనటం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు మంత్రి. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు యావత్ దేశ రైతులు కొనియాడుతున్నారని, రైతులు… ప్రతి పక్షాల అరోపలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ రెడ్డి.