ముఖ్యమంత్రి కేసిఆర్ గారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు 472 పోస్ట్ లు మంజూరు చెయ్యడం ద్వారా, రోడ్లు భవనాల శాఖ లో పునర్వ్యవస్థీకరణ చేపట్టి, మూడు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్స్ ను, 13 డివిజన్లను, 79 సబ్-డివిజన్లను, 124 సెక్షన్ లను కొత్తగా ఏర్పాటు చేసుకున్నమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రం సిద్దించిన రోజైన జూన్ 2 నుండి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంబించాడానికి,పూర్తీ అదనపు బాద్యతలతో అధికారులను నియమించేందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి వేముల నూతన సెక్రటేరియట్ లో 5వఅంతస్థులో గల తన ఛాంబర్ లో సంబంధిత ఫైల్ పై తొలి సంతకం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….
ఈ నూతన కార్యాలయాల ఏర్పాటు వలన రోడ్లు భవనాల శాఖ లో పరిపాలన వికేంద్రికరణ జరిగి, నూతన రహదారుల నిర్మాణం, రహదారుల మరమ్మత్తులు, ప్రజలకు సత్వర సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు మరియు ప్రభుత్వ అసుపత్రుల నిర్మాణం వేగంగా జరిగే అవకాశము ఏర్పడుతుంది, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయసాదనయైన “బంగారు తెలంగాణ” నిర్మాణం సాకారం అవుతుందన్నారు.
మంత్రి తన ఛాంబర్ లో అసీనులై,తొలి ఫైల్ పై సంతకం చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రిని అభినందించి,ఆశీర్వదించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,పలువురు ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్ లు,ఆర్ అండ్ బి ఉన్నాతాధికారులు సెక్రటరి శ్రీనివాస రాజు,ఈఎన్సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు,సి.ఈ సతీష్,మోహన్ నాయక్,ఎస్.ఈ సత్యనారయణ,లింగారెడ్డి,ఈ.ఈ శశిధర్, డి.ఈ మోహన్ పాల్గొన్నారు.