వేములవాడ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట రాజు ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదుల సౌకర్యార్థం గదితో పాటు వేసవి కాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా, సీనియర్ సివిల్ జడ్జి సట్టు రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయిల చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు న్యాయమూర్తులు మాట్లాడుతూ మహిళా న్యాయవాదులకు కోర్టులో ప్రత్యేక గది ఏర్పాటు చేయడం సంతోషకరమని, వేసవికాలం కోర్టుకు విచ్చే కక్షిదారులకు కోర్టు ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి దాహర్తిని తీరుస్తున్న బార్ అసోసియేషన్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏ.జి.పి గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి నక్క దివాకర్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల గౌడ్, పురుషోత్తం, కిషోర్ రావు, పొత్తూరు అనిల్ కుమార్, చర్ల ఆనంద్ కుమార్, పర్లపెల్లి అంజయ్య, అవధూత రజనీకాంత్, కటకం జనార్ధన్, నాగుల సంపత్, మహిళ న్యాయవాదులు సంగీత, అన్నపూర్ణ, సుజాత, మమత, నయిమా నసీరా , లక్ష్మి ప్రసన్న, సుప్రియ పాల్గొన్నారు.