Sunday, November 16, 2025
HomeతెలంగాణVenkatapuram: 'తెలుగుప్రభ' వార్తకి స్పందన, సాయానికి సై అంటున్న మనసున్న మారాజులు

Venkatapuram: ‘తెలుగుప్రభ’ వార్తకి స్పందన, సాయానికి సై అంటున్న మనసున్న మారాజులు

సాయానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ

తెలుగుప్రభ దినపత్రిక బుధవారం నాడు (వడగళ్ల వానకు కుప్పకూలిన ఇల్లు) అనే టైటిల్ తో ప్రచురించిన వార్తకు అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ స్పందించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్ర పురం గ్రామంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం రాత్రి సమయంలో గార నీలం అనే వ్యక్తి ఇల్లు నేలమట్టం అయింది.ఇది తెలుసుకున్న స్థానిక తెలుగుప్రభ ప్రతినిధి వార్త ప్రచురించగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పీర్ల కృష్ణ బాబు స్పందించి,నిరాశ్రయులైన కుటుంబానికి నిత్యావసర సరుకులకు సరుకులతో పాటు వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు,అలాగే ఎలాంటి అవసరం వచ్చిన మీకు మా సంస్థ అండగా ఉంటుందని ఆ కుటుంబాన్ని ధైర్యాన్ని ఇచ్చాడు. అలాగే ఆ కుటుంబ సభ్యులు తెలుగుప్రభ దినపత్రిక యజమాన్యానికి స్థానిక విలేకరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad