Tuesday, September 10, 2024
HomeతెలంగాణVerdict: సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందే: హైకోర్టు

Verdict: సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందే: హైకోర్టు

తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగించటాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదం కొలిక్కి వచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు కొట్టేయటం విశేషం. అయితే ..3 వారాలు సమయం కావాలని సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. హైకోర్టు ఎలాంటి సమయం ఇవ్వలేదు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించునున్నారు సోమేశ్ కుమార్. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

ఏపీ క్యాడర్ కు వెళ్లాలని తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయితే ఈ ఈ ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఆదేశించింది. దీంతో అప్పటినుంచీ ఈయన తెలంగాణలోనే ఉండిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News