Thursday, September 19, 2024
HomeతెలంగాణVijayasanthi @ Mallapur: మల్లాపూర్ లో రాములమ్మ

Vijayasanthi @ Mallapur: మల్లాపూర్ లో రాములమ్మ

జువ్వాడి గెలుపు కోసం ప్రచారం

టిఆర్ఎస్ బిజెపి లకు బుద్ధి చెప్పాలని, రాబోయే ఎన్నికలలో రెండు పార్టీలకు చరమ గీతం పాడాలని, కాంగ్రెస్ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కోరారు. మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో విజయశాంతి ప్రసంగిస్తూ కాంగ్రెస్ నీ గెలిపించాలని బిజెపి బీఆర్ఎస్ లను చిత్తుచిత్తుగా ఓడ గొట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ బిజెపిల చీకటి ఒప్పందం నచ్చకనే బీజేపీ నుండి బయటకు వచ్చానని, బీజేపీ బి ఆర్ యస్ ల మైత్రిని ప్రజలు గ్రహించారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. దొంగ హామీలతో బి ఆర్ యస్ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని, ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగా రావు మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం దోచుకునేందుకు ఉన్నదని, నియోజకవర్గంలో ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు…ఉద్యోగాలు లేవు…మూడు ఎకరాల భూమి లేదు. ఇలా అన్ని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిర్రు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మున్నాళ్ళకే కుప్పకూలింది.

- Advertisement -

రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదు. రైతుల్ని నిండా ముంచిర్రు. రైతుల్ని ఆదుకునేది కాంగ్రెస్ మాత్రమే.. పైసలు సంపాదించుకోవడానికి కల్వకుంట్ల కుటుంబం ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి తొలగిస్తాం. బడుగు, బలహీనుల కోసం నిరంతరం పాటు పడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తండ్రి పోతే కొడుకు ఇలా వాళ్లే పెత్తనం చేలాయిస్తున్నారు, అవినీతికి కేరఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబం. అవినీతి ప్రభుత్వనికి చరమగీతం పాడాలి. ఎమ్మెల్యే స్వంత గ్రామంలో తిరుగుబాటు మొదలయ్యింది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఏంటో చూపిస్తాం. ఆరు గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తాం. కెసిఆర్ నియంత పాలనను విముక్తి చేద్దాం. కర్ణాటకలో గ్యారెంటీ పథకాలు పక్కాగా అమలు చేసాం. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి చుడండని, జువ్వాడి నర్సింగా రావుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి కరం, జువ్వాడి కృష్ణ రావు, కంతి మోహన్ రెడ్డి, ఎలాల జలపతి రెడ్డి, పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News