వీర్నపల్లి మండల కేంద్రంలో నూతన హెచ్ పి పెట్రోల్ బంక్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపిపి మాలోత్ భూల, వీర్నపల్లి గ్రామ సర్పంచ్ పాటి దినకర్,సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఎంపిటిసి అరుణ్ కుమార్, మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు సురేష్ నాయక్, వీర్నపల్లి ఉపసర్పంచ్ బోయిని రవి లతో కలసి ప్రారంభించారు, ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఆగయ్య మాట్లాడుతూ మారుమూల ప్రాంతం వీర్నపల్లి మండలంలో ఇప్పటికే రెండు పెట్రోల్ బంక్ లు ఉన్నప్పటికీ నూతనంగా మరో బంక్ ప్రారంభం కావడం మండల ప్రజలకు శుభపరిణామం అన్నారు ఎల్లవేళలా రైతులకు ప్రయాణికులకు పెట్రోల్ అందుబాటులో ఉండేవిదంగా చూడాలని, మండలం ఏర్పడక ముందు ఎల్లారెడ్దిపేట మండలానికి 15 కిలోమీటర్ల దూరం వెళ్లి పెట్రోల్ డీజిల్ తెచ్చుకొనె వారని గుర్తు చేశారు మండల రైతులు ప్రజల కష్టాలు ప్రస్తుతం తిరయని అధిక ధరలకు పెట్రోల్ డీజిల్ కొనే రోజుల నుండి మండల కేంద్రంలో డీజిల్ పెట్రోల్ దొరకడంతో రైతులకు డబ్బులు సమయం ఆధా ఆవు తుందని అన్నారు బంక్ యాజమాన్యం రైతులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాంద్ పాషా,బానోత్ విట్టల్ నాయక్,మల్యాల అశోక్,శ్రీరాం నాయక్, పెడతాన పెళ్లి శేఖర్, జోగుల సుదర్శన్,గంగాధరి అనిల్, కంటం రజిని కాంత్,లకావత్ ఎసంత్ నాయక్, గంగారాం,స్థానిక ఎస్సై నవత, భారత రాష్ట్ర సమితి మండల మహిళ విభాగం అధ్యక్షురాలు గుగులోతు కళ, బంక్ యాజమాన్యం కుటుంబ సభ్యులు ఉన్నారు.