Friday, March 21, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Suneetha: తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్

YS Suneetha: తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్

దివంగత మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి(Suneetha) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రధానంగా సీబీఐ అధికారులతో పాటు నిందితులను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే దాదాపు నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ పురోగతి ఏమీ లేదనిపేర్కొన్నారు.

- Advertisement -

2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి హత్య జరిగిందని.. విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు ఛార్జీషీట్లు దాఖలు చేశారని సునీత తరపు న్యాయవాదతి పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోందని.. ఇది ఆరు నెలల్లో ముగించేలా కోర్టును ఆదేశించాలని కోరారు. సీబీఐ అధికారులు ప్రతివాదులకు ఇచ్చిన హార్డ్ డిస్క్‌లు తెరుచుకోవడం లేదన్నారు. దీంతో పదిహేను నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదని హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐతో పాటు నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News