Friday, November 22, 2024
HomeతెలంగాణVivekananda: అధికారులు బీ అలెర్ట్

Vivekananda: అధికారులు బీ అలెర్ట్

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలి

ఎడతెరిపి కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. డివిజన్ వార్డ్ కార్యాలయాలలో మాన్సూన్ డిసాస్టర్ టీంని ప్రజలకు అందుబాటులో ఉండాలని, వర్షాకాల సమస్యలపై పిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెం – 040 – 21111111.. ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే వివేకా అన్నారు.

- Advertisement -

గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపద్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్, గాజులరామరం జంట సర్కిల్ ల అధికారులతో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులు అందరూ సమన్వయ పరుచుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని, ప్రతి డివిజన్ వార్డ్ కార్యాలయాలలో మాన్సూన్ డిసాస్టర్ టీం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి విపత్తులు సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మాన్సూన్ డిసాస్టర్ టీంని ఆదేశించారు, ప్రతి కాలనీ, బస్తీలలో వరద నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు రోడ్లు, నాలలను శుభ్రపరచాలని, అసంపూర్తిగా మిగిలిఉన్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ డెప్యూటీ కమిషనర్ మంగతయారు, ఈ.ఈ.లు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, టౌన్ ప్లాన్నింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News