Sunday, September 8, 2024
HomeతెలంగాణVivekananda: 101 రోజుకు చేరిన వివేకా ప్రగతి యాత్ర

Vivekananda: 101 రోజుకు చేరిన వివేకా ప్రగతి యాత్ర

ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కాలనీ ప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ డివిజన్ విజయ్ నగర్ కాలనీ, మారుతి నగర్ లో 101 రోజు ప్రగతి యాత్ర బాగంగా ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్ కలిసి పర్యటించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివుద్ది పనులను పరిశీలించి మిగిలి ఉన్న సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి తమ కాలనీలను అభివృద్ధి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళ హారతులతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. మాట ఇచ్చిన ప్రకారం కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీవాసులంతా ఎమ్మెల్యే వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అక్కడే ఉన్నసంబంధిత అధికారులకు వ్యయప్రణాళికలు సిద్ధం చేసి వాటిని త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారిపోయిన, సంక్షేమ సంఘాలు ఇదే ఐక్యతతో ఉంటూ ఇంతకుమించి అభివృద్ధికి చేరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News