Sunday, September 8, 2024
HomeతెలంగాణVivekananda: జిఏచ్ఎంసి ఔట్ సోర్సింగ్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం

Vivekananda: జిఏచ్ఎంసి ఔట్ సోర్సింగ్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం

మీ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ ఎమ్మెల్యే హామీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం కుత్బుల్లాపుర్ రెండు సర్కిల్లోని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కె పి వివేకానంద చింతల్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులని సొంత బిడ్డల్లా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్న సంగతిని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల కృషిని గుర్తించి, రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలను పెంచి, వారి గౌరవానికి తగిన గుర్తింపుని ఇచ్చారని అన్నారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎంటమాలజీ శాఖ ఉద్యోగుల సేవలు మరువలేనివని ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. కెసిఅర్ కూడా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి అని మీ ఈ సమస్యను త్వరలోనే సంబంధిత పురపాలక శాఖ మంత్రివర్యులు కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News