Friday, September 20, 2024
HomeతెలంగాణVoter slips: ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ

Voter slips: ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ

అర్ఓల అధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ..

ఓటరు జాబితాలో పేరున్న వారికి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా ఇంటింటికివెళ్లి ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ పక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు పర్వం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తేలడంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఓటర్ సహచర స్లిప్పులు పంపిణీ కసరత్తు చేశారు. జిల్లా అన్ని జిల్లాగా కంటే ఎక్కువగా 15నీ అసెంబ్లీ నియోజ వర్గాలు, అందులో 4119పోలింగ్ కేంద్రాలు కాగా మొత్తం 45 లక్షకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహానగరంలో ఓటు వేయడానికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఓటరు సమాచార స్లిప్పులలో ఓటరు పేరు పోలింగ్ కేంద్రం నంబర్ పోలింగ్ ఉన్న ప్రదేశం పోలింగ్ తేదీ , సమయం తెలియజేస్తూ బి ఎల్ ఓ ల ద్వారా ఇంటింటికీ వెళ్లి స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఈ స్లిప్పులు బి ఎల్ ఓ ఇతరుల ద్వారా పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టంగా ఆదేశాలు రిటర్నింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో..అర్ఓల అధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం సాఫీగా సాగుతున్నది. ఇంటింటికీ పంపిణీ చేసే సందర్భంలో ఇల్లు యజమానికి స్లిప్పుతో పాటు ఓటర్ గౌడ్ అనే పుస్తకాన్ని కూడా బి ఎల్ ఓ అందజేస్తున్నారు.
ఇంటికి తాళం ఉన్న పక్షంలో వారి వివరాలను తెలుసుకొని నవంబర్ 30 తేదీన జరుగు ఓటింగ్ ఉన్నందున అట్టి విషయమై తెలియజేయడానికి మీ ఇంటికి వచ్చినా, మీరు ఇంటి వద్ద లేరని తెలిసినందున మీరు ఓటును ఎక్కడ వేస్తారు అంటూ.. బి అర్ ఓ జోన్ చేసి తెలుసుకొని ఆ ఇంటి యొక్క సమచారాన్ని తెలుసుకొని పూర్తి నివేదికను బి ఎల్ ఓ అర్ ఓ కు అందజేస్తారు. నివేదిక ప్రకారంగా ఆబ్సెంట్, శిఫ్టింగ్ డిలీట్,(ASD) లిస్ట్ ను అర్ ఓ తయారు చేసి, పోలింగ్ రోజున పోలింగ్ ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ముందుగా బి ఎల్ఓకు చెప్పిన ప్రకారంగా ఒకవేళ ఆ ఇంటి యజమానిగానీ అతని కుటుంబ సభ్యులు వచ్చి పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చిన సందర్భంగా ప్రధాన ఓటరు లిస్ట్ లో పేరు లేని పక్షంలో అప్పుడు పిఓఏ యస్ డి లి లిస్టు పరిశీలించి పేరు ఉన్న పక్షంలో ఓటేసేందుకు అవకాశం కల్పించబడును.
ఒకవేళ ఇంటి నీ షిఫ్ట్ చేసిన సందర్భంలో కొత్త అడ్రస్ షిప్ట్ అయినచో కొత్త అడ్రస్ లోనే ఓటు హక్కు వినియోగించాలి. పాత అడ్రస్ లో గల ఓటరు జాబితాలో పేరున్న దానికి ఎదురుగా షిఫ్ట్ అయిన ఓటరుగా నమోదు చేసిన నేపథ్యంలో వారు పాత అడ్రస్ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేయడానికి అవకాశం లేదు. ఏ యస్ డి లిస్టులో పేరున్నవారు కనుక ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చిన నేపథ్యంలో పిఓ వారందరి నీ వీడియో గ్రాఫ్ ముఖం అగుపడే విధంగా తీసుకోవాలనీ ఎప్పుడు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలలో నిబంధన పెట్టింది.
ఓటరు గైడ్ బుక్ లేట్ మాత్రం నగర ఓటర్ల కు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.
అందులో ఓటు వేసే విధానం పోలింగ్ స్టేషన్ తెలుసుకునేందుకు ఆన్ లైన్ లో తెలుసుకునేందుకు voters.eci.gov.in web సైట్ ద్వారా గాని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని చూసు కోవచ్చునని గైడ్ లో పొందుపరచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News