నగర వ్యాప్తంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాల వారికి తాత్కాలికంగా పునరావాసం కల్పించడానికి బల్దియా వ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ పరిధిలో శుభం గార్డెన్స్ గుజరాతి సమాజ్ బీరన్న కుంట స్కూల్ కాశీ కుంట చర్చ్ కె పి ఎస్ ఫంక్షన్ హాల్ శివనగర్ ఏ టి ఆర్ ఫంక్షన్ హాల్ బట్టుపల్లి రోడ్డు తో పాటు హన్మకొండ పరిధి 49వ డివిజన్ లో వి డి ఓస్ కాలనీ ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసినట్టు, ప్రస్తుతం సుమారు 400 మంది వాటిలో పునరావాసం పొందుతున్నారని వారికి ఆహారపు పొట్లాలతో పాటు చలి నుండి రక్షణకు దుప్పట్లు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.