తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ సంక్షేమ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి లో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు జరిగాయి. ఈ సందర్భంగా రాయపర్తి మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్, గొర్రెలు, వివిధ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేశారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు… ఈ సందర్భంగా తొర్రూరు, పెద్ద వంగర మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్, గొర్రెలు, వివిధ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేశారు. అలాగే తొర్రూరు లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు అందచేశారు.
ఆ తర్వాత జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తిలో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు… ఈ సందర్భంగా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్, గొర్రెలు, వివిధ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేశారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సీఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలను సమంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మార్చింది అన్నారు. మన రాష్ట్రం, నియోజకవర్గంలో అమలవుతున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, ఆయా పథకాలను ప్రజలకు వివరించారు.