ఇటీవల ఎన్నికై, ఈ రోజు అభినందన సన్మానాన్ని అందుకుంటున్న వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. హన్మకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ సత్కార సభ జరుగుతుండగా, వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మంత్రి, ముందుగానే అక్కడకు వెళ్ళి, కార్యవర్గాన్ని కలిశారు. వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రెస్ క్లబ్ తమ సభ్యులైన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తన వంతుగా ప్రెస్ క్లబ్ కు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.