భారత్ రాష్ట్ర సమితి పార్టీ తూర్పు వరంగల్ నియోజకవర్గంలోని హసన్ పర్తి మండల కేంద్రంలో KLN కన్వెన్షన్ హాల్ లో 53, 54 డివిజన్ల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక శాసనసభ సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంతో కీలకపాత్ర పోషించిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ కు వరంగల్ జిల్లా అంటే ప్రత్యేక అభిమాన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వం లో ఎన్నో అద్భుత విజయాలు సాధించామని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అవార్డులు అగ్రభాగం తెలంగాణవే అని ఆయన వెల్లడించారు.
రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు
గత 20 ఎండ్ల కింద యునెస్కో గుర్తింపు పొందివుంటే ఉమ్మడి వరంగల్ కు ఎంతోమంది విదేశీ పర్యటకులు వచ్చేవారు. అభివృద్ధి జరిగేదని, దేశంలో అత్యధిక కంపెనీ లు హైదరాబాద్ తరలివస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. లక్షల మందికి తెలంగాణ ఉద్యోగాలు వస్తున్నాయని, గతంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం బొంబాయి , దుబాయ్ కి పోయేవాళ్ళమని మంత్రి వివరించారు. వరంగల్ ను IT hub గా సీఎం కేసీఆర్, KTRలు కృషి చేస్తున్నారు. యువతకు కేసిఆర్, కేటీఆర్ ను భరోసా కల్పిస్తున్నారన్నారు.
బిజెపి పార్టీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కొత్త ఉద్యోగాల ఇవ్వకుండా… ఉన్న ఉద్యోగాలు ఉడగోర్తున్నారన్నారు. బి.ఎస్ ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసి లాంటి పెద్ద సంస్ధలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, Rule of రిజర్వేషన్లు పోతున్నాయని ఆయన వాపోయారు.